కలువాయి మండలం దాచూరు గ్రామానికి చెందిన కొందరు చేపల వ్యాపారస్థులు అనధికారికంగా బయటి ప్రాంతాలనుండి మత్స్యకారులను పిలిపించుకుని చేపల వేట సాగిస్తున్నారు. అలివి వలలు, బుట్టలతో డ్యామ్ లో చిన్న చేప పిల్లలతో సహా పడుతున్నారనే సమాచారంతో సభ్యత్వం కలిగినటువంటి మత్స్యకారులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఆరబెట్టి ఉన్నటువంటి దాదాపు రెండు టన్నుల చేపలను గుర్తించారు.. ఈ సందర్బంగా మత్స్యకారులు మాట్లాడుతూ... ఎక్కడో బయటి నుంచి వచ్చి ఇక్కడ సభ్యత్వం లేని మత్స్యకారులు అక్రమంగా చేపలు పట్టడం వలన తాము జీవనాధారం కోల్పోతామన్నారు.