. ఏలూరు జిల్లా.... చింతలపూడి మండలం చింతలపూడి లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో భారీ చోరీ చోటు చేసుకుంది. మూడు కోట్ల రూపాయలు గోల్డ్ (380 పాకెట్స్)తో పరార్ అయ్యాడు అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమామహేష్. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు ఆడిట్ చేయడానికి ఉదయం 11 గంటలకు వచ్చిన వడ్లమూడి ఉమామహేష్ చింతలపూడి సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్, అదే సంస్థలో క్యాష్ ఇయర్ గా పనిచేస్తున్న అమృతాలఆషా లను బయటకు పంపించి 380 పాకెట్స్ గోల్డ్ సుమారుగా 3 కోట్లు రూపాయలు గోల్డ్ తో పరార్ అయ్యాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.