మామిడికుదురు మండలం, పాసర్లపూడిలో పాడైపోయిన పంట పొలాలను ఓఎన్జీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. ఓఎన్జీసీ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాటు చేసిన రోడ్ల నిర్మాణం వల్ల పంట పొలాలు పాడైపోయాయని మూడు పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కొబ్బరి తోటలు కూడా దెబ్బతిన్నాయని వాటికి కూడా పరిహారం అందించాలని కోరారు.