ప్రకృతి వనరులను ఉపయోగించి చిత్రాలుగా మలచిన చరిత్రకారుడు వడ్డాది పాపయ్య జయంతి సందర్భంగా బుధవారం శ్రీకాకుళం పట్టణంలో గల క్రాంతి భవన్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఇందిరా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎటువంటి రంగులు లేని రోజుల్లో సహజ వనరులు అయిన బొగ్గు, సున్నం, వివిధ ఆకుల రసాలను ఉపయోగించి చిత్రాలను ఆయన సజీవంగా గీసే వారిని గుర్తు చేశారు. ఆయన గీసిన చిత్రాలు చందమామ, స్వాతి, నవ్య, విజయ మొదలగు పత్రికల ముఖ చిత్రాలుగా ముద్రించేవారని గుర్తు చేశారు.