బతుకమ్మ కుంట తుది దశ పనులు వేగంగా చేపట్టాలని,పార్క్ అందంగా ఉండాలని,అందమైన పూల మొక్కలు నాటాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు.గురువారం బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో పర్యవేక్షించారు.ఈ సందర్భంగా బతుకమ్మ కుంట లో అందమైన రంగుల తో ఏర్పాటు చేసిన గ్రిల్స్ ను, సందర్శకులకు ఏర్పాటు చేసిన బెంచ్ లను సెక్షన్ల వారీగా జిల్లా అధికారులతో , ఇంజనీరింగ్ అధికారులతో వాకింగ్ ట్రాక్ పనులు పరిశీలించారు. వాచ్ టవర్స్, ఐ లవ్ జనగామ బ్యూటీఫికేషన్ పనులను పరిశీలించారు.