అచ్చంపేట పట్టణంలో రైతులకు యూరియాను ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం లింగాల చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోకల మనోహర్ మాట్లాడుతూ రైతులకు యూరియాను కూడా ఇవ్వలేని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అవసరమా అని ప్రశ్నించారు మార్పు మార్పు అని మళ్లీ ఎరువుల కోసం గోసపడిన వెనుకటి రోజులు తెచ్చారని రైతులు వాపోతున్నారని వెంటనే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.