కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులో ఉన్న జగనన్న కాలనీ వెళ్లే రోడ్డు వల్ల పంట పొలాల్లో వర్షపు నీరు నిలబడి దాదాపు వందల ఎకరాలు నీటి మునిగాయంటూ రైతు ఆవేదన చెందారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీ వెళ్లే రహదారి చేసి పంట పొలాల్లో ఉన్న నీరు వెళ్లకుండా రోడ్డు హైటు చేశారంటూ తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నీటి మునిగిన పంటలకు న్యాయం చేయాలంటూ రైతు కోరారు.