బంజారా జాతిని జాగృతం చేయడం కొరకు సేవాలాల్ సేన ముందుండి పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ వెల్లడించారు. మంగళవారం 12 గంటలకు కోటగిరి మండల కేంద్రంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా జెండా ఎగుర వేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బలహీనవర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని వారిని చైతన్యపరిచే అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు.