శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పొన్నం బట్టేరు పరిసర ప్రాంతంలో గా నైరా కల్వర్టరు ఇటీవల పడిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో నైరా బట్టేరు పొన్నం నవనంపాడు గొల్లపేట గేదెలవానిపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 6 పంచాయతీలకు చెందిన స్థానిక ప్రజలు ఆయా గ్రామాల నుంచి శ్రీకాకుళానికి రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతo ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆమదలవలస మీదగా 20 కిలోమీటర్లు దాటి శ్రీకాకుళం నగరానికి చేరుకుంటున్నారు. ఇదే విషయంపై ఆర్ అండ్ బి అధికారి రాజశేఖర్ వద్