విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. గురువారం దోమకొండ మండల కేంద్రంలోని గడి కోటలో విలువిద్య పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విలు విద్య పోటీల్లో తమ సత్తాను చూపించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కనూరు సిఐ సంపత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.