కడప జిల్లా వ్యాప్తంగా ఆదివారం వినాయక చవితి పండగ పురస్కరించుకుని ఐదవ రోజు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతుంది. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలలో ఎలాంటి చిన్నపాటి ఘటనలు, అపశృతులకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఊరేగింపు, నిమజ్జన ప్రదేశాలలో ప్రత్యేకంగా అత్యాధునిక సి.సి కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు.