పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండల పరిధిలో ఉన్న వేటగానివలస సమీపంలో ఉన్న గెడ్డవద్ద గురువారం సాయంత్రం గిరిజనులు మాట్లాడారు. గెడ్డపై వంతెన లేకపోవడంతో ఐదు పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి, వంతెన నిర్మాణం జరపాలని డిమాండ్ చేశారు.