వెదురు కుప్పం మండల బీఎస్పీ ఆఫీసులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎన్. రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉంగరాల నాగేశ్వరరావు గారిని కొత్తగా మండల అధ్యక్షునిగా నియమించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, హరిబాబు, చంగల్ రాయలు, సురేష్ పాల్గొన్నారు.