కూకట్పల్లి రంగదాముని చెరువులో వినాయక నిమజ్జనాలను కొనసాగుతున్నాయి. ఈనెల రెండో తేదీ నుంచి ఇప్పటివరకు కూకట్పల్లి జోనల్ వ్యాప్తంగా 41,815 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు చారు. 11వ రోజు భారీగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి ముందుకు వెళ్తున్నామన్నారు.