ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో శుక్రవారం మత్స్యకారుల వలలో భారీ కొండచిలువ చిక్కుకుంది. ఎప్పటిలాగే గోదావరిలో చేపల వేటకోసం వలలు వేస్తుండగా ఈ కొండచిలువ వలలో పడింది. మత్స్యకారులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గోదావరి వరద ఉధృతిలో ఎగువ ప్రాంతం నుండి కొండ చిలువ కొట్టుకు వచ్చినట్లు అధికారుల వెల్లడించారు.