వైసీపీ ప్రభుత్వ హయాంలోనే డెవలప్మెంట్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిందని వైసిపి మున్సిపల్ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు టిడిపి కౌన్సిలర్లు ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన ఇవాళ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 1150 వర్కులు జరిగాయని వాటన్నిటిపై విజిలెన్స్ ఎంక్వైరీ టిడిపి కూటమి ప్రభుత్వం వేసింది అని చెప్పారు అందులో ఏమీ అవినీతి తేలక పోవడంతో మళ్లీ బిల్లులు రాణి 16 వర్కుల కు సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ కు విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని మళ్ళీ పిటీషన్ పెట్టారని చెప్పారు.