కాగజ్నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీలో ఎస్పీ యజమాన్యం నిర్మించిన గేటును శుక్రవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. హనుమాన్ టెంపుల్ సమీపంలోని రోడ్డుపై గేటు నిర్మాణం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో మున్సిపల్ సిబ్బంది గోడను కూల్చివేశారని స్థానికులు తెలిపారు,