జీడి నెల్లూరు: పోక్సో కేసులో నిందితుడికి జైలు సోమవారం, కార్వేటినగరం మండలంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన హరీష్ (30) అనే నిందితుడికి చిత్తూరు స్పెషల్ పోక్సో కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయిన హరీష్ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఎం. శంకర రావు మూడేళ్లు జైలు, రూ. 2 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.