గుడివాడ లో ప్రజలతో కలిసి ఉంటూ వారి సహచరుడిగా సమస్యల పరిష్కరించడంలోనే నాకు సంతృప్తి ఉంటుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలోని 8వ వార్డు సచివాలయంలో అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో పాటు పరిసర వార్డులకు చెందిన ప్రజలు తమ సమస్యల వినతులను ఎమ్మెల్యే రాముకు అందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.