నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని ముద్దవరం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పలుకూరు గ్రామానికి చెందిన సానె సుధాకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు. బాధితుడిని బేతంచెర్లకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.