అన్నమయ్య జిల్లా ములకలచెరువులో గురువారం బషీరాబాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరులకు సిపిఐ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల సమితి అధ్యక్షుడు అంజనప్ప మాట్లాడుతూ, 2000 ఆగస్టు 28న విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బషీరాబాగ్ షాహిద్ చౌక్ వద్ద నిర్వహించిన భారీ ప్రదర్శనలో పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తుచేశారు. అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు బలపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పించడం తమ కర్తవ్యమని తెలిపారు.