ఆదోనిలో అన్నదాత పోరు కార్యక్రమం వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ధర్నా చేశారు. కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. రైతు సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు.