సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న సింహగిరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాజువాక సాయిరాం నగర్ లోని వైద్య గణపతి సన్నిధిలో వినాయక ఉత్సవాలు ఆదివారం మధ్యాహ్నంతో ముగిశాయి.ఈ సందర్భంగా డాక్టర్ జమునారాణి పర్యవేక్షణలో అన్నమాచార్య,విష్ణు సహస్రనామ కీర్తలను ఆలపించారు.సింహగిరి సంగీత అకాడమీ సభ్యుల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.ఏటా వినాయక ఉత్సవాల ఆఖరు రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది అని తెలిపారు.ట్రస్ట్ ద్వారా నెలనెలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.