మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను అకస్మికంగా సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను తెలుసుకొని జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వేచ్ఛమైన వాతావరణంలో విద్యను అందించాలని విద్యార్థుల సృజనాత్మకత నైతిక విలువలను నేర్పించాలని ఈ సందర్భంగా సంబంధిత ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.