పట్టణంలోని మూడు మసీదులకు వాటి అభివృద్ధి పనులకు గాను సుమారు 11 లక్షల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో తన నివాసం లో ఆయా మజీద్ కమిటీ సభ్యులకు అందజేశారు.జగిత్యాల పట్టణ మీర్జా అహ్మద్ బేగ్ మజీద్ ( ఖాజీ పుర) - అభివృద్ధి పనులకు 3,75,234 రూపాయల విలువ గల చెక్కును, అంగడి బజార్ లోని నూర్ మజీద్ అభివృద్ధి పనులకు 3,73,334 రూపాయల విలువ గల చెక్కును, మరియు న్యూ బస్టాండ్ జలీలి మజీద్ అభివృద్ధి పనులకు 3,71,692 రూపాయల విలువ గల చెక్కును ఆయా మజీద్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు కృతజ్ఞతలు తెలుపుతూ,ఎమ్మెల్యే ను సత్కరించారు.