యాదాద్రి భువనగిరి జిల్లా తుమ్మల రామారం మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మికంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు భోజనం బాగుంటుందా ? మెనూ ప్రకారం పెడుతున్నారా ? అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యత లేకపోవడం సరిగ్గా ఉండకపోవడంపై ఏజెన్సీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రోజుల్లో పనితీరు మారకపోతే ఏజెన్సీని తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు.