ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జండా చెట్టు వద్ద నివాసం ఉంటున్న రైతు హుస్సేన్ పొలం వద్ద తనపై మద్యం బాబులు దాడి చేసి నగదు దోచుకెళ్ళినట్లు తెలిపారు. తన పొలం వద్ద చెట్టు కింద మద్యం తాగడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించారు. అనంతరం డబ్బులు ఇవ్వమని అడుగగా తన వద్ద లేవని చెప్పడంతో హుస్సేన్ పై దాడికి పాల్పడి తన జోబులో ఉన్న 36 వేల రూపాయల నగదు దోచుకెళ్ళినట్లు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.