బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారే సోమశేఖర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ అక్రమ కేసుల నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టుకు రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండల గ్రామీణ స్థాయిలో ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. అక్రమ అరెస్టులు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అంటే అందరికీ అభిమానం ఉందని గుర్తు చేశారు.