కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8,9,10 తేదీలలో కడప నగరంలో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ కర పత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాంద్ భాషా , వ్యవసాయ కార్మిక సంఘం అట్లూరు మండలం అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య ,దుర్గమ్మ, తదితరులు పాల్గొన్నారు.