రామాయంపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పర్యటించారు. గత రాత్రి నుండి కురిసిన భారీ వర్షాలు క్రోడంతో పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. పలు కాలనీలకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రెడ్డి కాలనీతో పాటు ఐదో వార్డు మూడో వార్డు ఎస్సీ కాలనీలో పర్యటించిన ఆమె వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు నష్టాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.