ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాలువ కట్ట వద్ద ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకును గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. అర్ధరాత్రి దుండగులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయిందని బైక్ యజమాని రఫీ తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బైక్ విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే బైకుకు నిప్పంటించి ఉంటారని రఫీ అనుమానం వ్యక్తం చేశారు.