నగరం లోని ఓ పాఠశాలలో ప్రభుత్వ జిల్లా స్థాయి చేతివ్రాత పోటీలు ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని హ్యాండ్ రైటింగ్ పరీక్ష రాశారు. కరీంనగర్ జిల్లాస్థాయి చేతివ్రాత పోటీలను ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు మరియు ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులకు స్థానిక నగరం లోని పద్మనగర్ పారమిత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు.