యాదాద్రి భువనగిరి జిల్లా: నిజాం నిరంకుశ పాలన జాగిద్దర్ జమీందార్ భూస్వాముల ఆగడాలు సహించని సామాన్యులు రైతులు కష్టజీవులు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని సిపిఎం జిల్లా నాయకులు మంగ నరసింహులు శనివారం అన్నారు. ఈ సందర్భంగా శనివారం రాజాపేట మండల కేంద్రంలోని సిపిఎం మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 9న భువనగిరి జిల్లా కేంద్రంలో వీర తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ప్రజా విజయాలు వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.