శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చిట్టివలసకు చెందిన సవిరి పూర్ణ వరకట్న వేధింపులు తాలలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితం వివాహం జరిగినప్పటి నుండి వేధింపులు కొనసాగాయి పుట్టింటికి వెళ్లి పెద్దల సమక్షంలో అత్తారింటికి తిరిగి వెళ్ళినప్పటికీ వేధింపులు ఆగలేదు ఈ నెల రెండవ తేదీన గడ్డి మందు తాగడంతో ప్రింట్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది పోలీసులు కేసు నమోదు చేశారు..