ఖానాపూర్ పట్టణకేంద్రంలోని AMK పంక్షన్ హాల్లో వికలాంగులు,పెన్షన్ దారులు శుక్రవారం మహా గర్జన సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఒంటరి మహిలళకు,బీడీ కార్మికులకు,వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కండ నరాల బాధితులకు 15వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని,కొత్త పెన్షన్లు ఇచ్చి వికలాంగులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న హైదరాబాదులో జరిగే మహా గర్జనను విజయం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.