విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాజ్యశ్యామల అమ్మవారికి, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులు ఇచ్చారు. పంచాంగాన్ని ఆవిష్కరించారు. పీఠాధిపతి భక్తులకు స్వయంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.