నూతనంగా నిర్మల్ జిల్లా డిఈఓ గా బాధ్యతలు స్వీకరించిన భోజన్న మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పూల బొకే అందజేశారు. జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా నూతన డిఈఓ కు సూచించారు. వీరి వెంట విద్యాశాఖ సిబ్బంది ఉన్నారు.