రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుంటారని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఈనెల 4న అనంతపురంకి చెందిన మల్లికార్జున, శశికళ దైవదర్శనం కోసం నేపాల్ వెళ్లి అక్కడ అల్లర్లలో చిక్కుకపోయారు. మంత్రి లోకేష్ చొరవతో పాటు వారు సురక్షితంగా అనంతపురం చేరుకున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మల్లికార్జున, శశికళ దంపతులను ఎమ్మెల్యే దగ్గుపాటి, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పరామర్శించారు. వారికి మిఠాయిలు తినిపించారు. వారు కూడా సంతోషంగా ఎమ్మెల్యేకి మిఠాయిలు తినిపించారు.