చిత్తూరు: పద్య పోటీలలో విద్యార్థుల ప్రతిభ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జడ్పీ మీటింగ్ హాల్లో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పద్య పోటీలు నిర్వహించారు. నగరంలోని 26 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలవిద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు గిరిధర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ అధ్యక్షులు శ్రీధర్ వంటి పలువురు ప్రముఖులు విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.