అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం విజయవంతం అయిందని ఆల్ ఇండియా ఇస్కాన్ పాదయాత్ర అధ్యక్షులు స్వామీజీ శ్రీమాన్ ఆచార్య తెలిపారు. బుధవారం శిరివెళ్ల లో ఇస్కాన్ పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఇస్కాన్ భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తనలో పాల్గొన్నారు.కేదార్నాథ్ బదరీనాథ్, ద్వారకా,పూరి జగన్నాథ్, శ్రీకూర్మం,మంగళగిరి గుంటూరు మీదుగా నంద్యాల జిల్లాకు పాదయాత్ర చేరుకుందన్నారు.