మిద్దెల పైన తోటల పెంపకం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ హేమంత్ కుమార్ రిటైర్డ్ ప్రొఫెసర్ కీర్తి వెంకయ్య అన్నారు తిరుపతి రైల్వే కాలనీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు విచ్చేసి ప్రజలు వారి వారి మిద్దెల పైన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లాభాలను వివరించారు.