తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు పార్వతి, సరస్వతి, రామాలయం, పలు ఉప ఆలయాలను ద్వారబంధనం చేశారు. ఆలయా అధికారులు,అర్చకులు ఆలయ తలుపులు మూసి వేసి భక్తుల దర్శనం నిలిపివేశారు. తిరిగి సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల అనంతరం ఉదయం 7.30 గం. భక్తుల దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ ఉపప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు.