పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి, హెచ్. కారాడవలస గ్రామ రెవెన్యూ లో గల వెలుగులమెట్ట పై గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం ఆ పార్టీ నాయకులు కోలా కిరణ్ కుమార్, తీళ్ళ గౌరీ శంకర్రావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పార్వతీపురంలో చెరువులను కబ్జా చేసి సకాలంలో వర్షాలు పడకుండా చేశారన్నారు. ఇటీవల బడిదేవరకొండ పై గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు వెలుగుల కొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతిస్తే వందలాది కుటుంబాలు వీధిన పడతాయి అన్నారు.