ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి .వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రవేట్ ఆసుపత్రులు మరియు స్కాన్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం తొమిది ప్రవేట్ వైద్యశాల లను తనిఖీలు నిర్వహించారు . ఆసుపత్రులు నిర్వహిస్తున్న వివిధ రికార్డులను పరిశీలించారు.అక్కడ రోగులకు అందిస్తున్న సేవలను, వాటి వివరణ నమోదు చేస్తున్న రికార్డులను కూడా నిశితంగా పరిశీ లించారు.