పర్యావరణ పరిరక్షణ కోసం నీటి కాలుష్యాన్ని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలని పూజించాలని, సోమవారం సాయంత్రం బొండపల్లి లో తహసిల్దార్ రాజేశ్వరరావు సూచించారు. బొండపల్లి తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖ తరపున మట్టి గణపతి ప్రతిమలను తహసిల్దార్ రాజేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు ఇతర అధికారులు చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.