అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్, భూమయ్య లు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేక జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.