రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీతోనే రాష్ట్రం అన్ని విధాలా ప్రగతి పథంలో పయనిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ యూనిట్ దార్శనికత కార్యాచరణ కార్యాలయాన్ని మంత్రి, కమిషనర్ యస్.రవీంద్ర బాబుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజన్ అనగానే అందరికీ చంద్రబాబే గుర్తు వస్తారని, చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ‘విజన్ @2020’ కు శ్రీకారం చుట్టారని, దాని ఫలితంగానే హైదరాబాద్ విశ్వనగరంగా ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. ముందుచూపుతో పనిచేస్తేనే భావితరాలకు మంచి ఫలితాల