శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎమ్మెల్యే మేఘారెడ్డి తో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన పట్టిమ స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం అని ఈ సందర్భంగా అన్నారు. వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా ఆమె చూపిన పటిమ ఎంతో గొప్పదని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు