ప్రపంచవ్యాప్తంగా AI ట్రెండ్ నడుస్తోంది. మరణించిన వారిని AI సాంకేతిక సహాయంతో తిరిగి భూమిపైకి వచ్చి ఫంక్షన్ లో పాల్గొంటున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి సాంకేతికతతో కొందరు ఒంగోలు నగరంలో మంచు పడి గడ్డకట్టితే ఎలా ఉంటుందో చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో గురువారం మధ్యాహ్నం ఐదు గంటల సమయంలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోను నెటిజన్స్ షేర్ చేస్తూ అదరహో అని కామెంట్ చేస్తున్నారు. ఈ సుందరమైన వీడియో చూసి వీక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.