కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి ఘన స్వాగతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు బిజెపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.